మీకూ మీ కుటుంభ సభ్యులకూ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు



మీకూ మీ కుటుంభ సభ్యులకూ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు



కొటప్పకొండ గురించిన నిజాలు

                           కొటప్పకొండ గురించిన నిజాలు


కొటప్పకొండ కి సమీపమున దక్షిణముగా కొండకావూలు అనుపల్లె వున్నది. 

ఆ ఊరిలొ ఒక గొల్లవాడు ఉండెడివాడు. వాని భార్యపేరు కుందరి. వారికూతురు ఆనందవల్లి. 

ఆకూతురు పుట్టినది మొదలు వారికి అదృష్టము కలసి వచ్చెను. ఆనందవల్లికి చిన్నతనమునుండి శివునియందు పెక్కు భక్తి కలదు.

ఆబాలిక ఇతరాలంకారములను వీడి విభూతిని, రుద్రాక్ష లను ధరించుచుండెను. 

నిత్యమును త్రికూటేశ్వరుని కొండయెక్కి కోటీశ్వరుని పూజించి వచ్చుచుండెను. 

ఒక మహా శివరాత్రి పర్వమున ఆనందవల్లి ఓంకారనదిలో స్నానమాడి రుద్రశిఖరమున ఈశ్వరుని పూజించుచుండెను. 

అపుడచటనున్న బిల్వ వనమున తపోనిష్టనున్న ఒక దివ్య పురుషుడామెకు ప్రత్యక్షమయ్యెను. 

అంత నామె ఆతనిని అభిషేకించి, పాలు నావేద్యము గావించి, తాను తాగినది. 

నాటినుండి ఆనందవల్లి ప్రతీదినము అటులనే చేయుచుండెను. 

వేసవియందొకనాడు ఆమె పాపవినాశ తీర్ధమునుండి నీళ్ళు తెచ్చిన కుండను క్రిందదించి ఆ మహాపురుషుని రాకకై వెచియుండెను. 

అపుడొక కాకి ఆకుండపై వ్రాలెను. దానివలన కుండకింద పడి పగిలిపోయి నీళ్ళన్నీ వొలికిపోయెను.

ఆమె అందుకు బాధపడి,కాకులచ్చటికెన్నడూ రాకుండా శపించెను. 

ఆమె ఇలాగే శివుని ప్రతిదినము ఇచట సేవించుచు తపమును ఆచరించుచుండెను. 

అంతట శివుడు జంగమ రూపియే ఆమెను పరీక్షింపదలచి,ఆమెను ఆతనిని పూజింపవలదు అని తలపోయగా ఆమె ఆతనిమాటలు వినకుండ ప్రతిదినము ఆదివ్య పురుషుని సేవించుచుండెను. 

ఉపాయాంతరము కాకాఅతడు బ్రహ్మచారిణిఅగు ఆమెకు తన మాయచే గర్భమును కలిగించెను.అప్పటికి, ఆమె ఆతని సపరయలు మానకుండెను. 

ఆమె భక్తి శ్రద్ధలకు ఆతడెంతయో అచ్చరవునొంది నీవు నకయి శ్రమపడవలదు నేనె నీఇంటికి వచ్చెదను. నీవు ముందుగా నడు నేను నీ వెనుకనే వచ్చెదను వెనుకకు మాత్రము చూడవలదు ఇది ఆన చూచినచో నేనచ్చోటనే ఆగఇపోయెదను. 

\అందుకు ఆనందవల్లి అంగీకరించి నడక సాగించెను. కొంతదూర పోయాక ఆనందవల్లికి ఒక భయంకర ధ్వని వినపడగ దానికామె జడిసి వెనుతిరిగి చూడగ ఆ మహా పురుషుడక్కడనే సమాధినిష్ఠ అయ్యెను. 

ఆబిలమునె ఇప్పుడు కొత్త కోటప్పకొండ అని అందురు.అప్పుడె ఆనందవల్లి కుమారుని ప్రసవించెను. జరిగినదానికి ఆమె వగచు చుండగా ఇంతలో ఆ శిశివు మాయమాయెను.

అందులకామె ఆశ్చర్యపడి, ఆ మహా పురుషుడు తనను పరీక్షించుచున్నాడనుకొని, ఆతడే సాక్షాత్తు పరమశివుడని భావించి అక్కడే ఆమె తపముచేసి శివ సాన్నిధ్యము పొందెను. 

కొత్త కోటప్పకొండకు కొంచెము దిగువున ఆనందవల్లి ఆలయము ఉన్నది. ఆనందవల్లి కాలమువాడగు సాలంకయ్యఅను శివభక్తుడొకడు ఈ కొతా కోటప్ప కొండను, ఆనందవల్లి దేవాలయమును కట్టించినాడట. 

తరువాత కోటప్పకు కల్యాణాది మహోత్సవములు చేయదలచి సాలంకయ్య పడమరగా పార్వతికి దేవళము కట్టించినాడు. బ్రహ్మచర్య దీక్షనుండు దక్షిణామూర్తి నెలకొనిన క్షేత్రమిది.

అందువలన ఇక్కడ వివాహాలు చేయకూడదను అశరీరవాణి సాలంకయ్యకు వినపడగ ఆయన ఆప్రయత్నమును విరమించెను. అందువలన ఈ గుడిలో వివాహాది కార్యక్రములను అనుమతించరు.

పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు


    

 పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు :




1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి"Opposite direction (వ్యతిరేక దిశ)" లో ఉంటుంది.

2) ఆలయంపై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణం లో ఎక్కడ ఉన్నా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.


3) మాములుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది మరియు సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా      

    ఉంటుంది. కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.

4) పక్షులు గానీ, విమానాలు గానీ ఆలయం మీద వెళ్ళవు.


5) గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా, ఏ దిశలో అయినా అస్సలు కనిపించదు.


6) ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలనే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షలు మందికి 

     పెట్టవచ్చు.  అయినా అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు !

7) జగన్నాథుని ఆలయంలోని వంటశాలలోచక్కల నిప్పు మీద 7 మట్టిపాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి 

    వండుతారు. అయినా ముందు పైన ఉండే మట్టిపాత్ర వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేదివేడి అవుతుంది. 

8) ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు వేయగానే సముద్రం శబ్దం వినపడదు, అదే ఒక అడుగు వెనక్కి  
    వేస్తే శబ్దం వినిపిస్తుంది.

స్వైన్‌ ఫ్లూ నివారణ మార్గాలు

"స్వైన్‌ ఫ్లూ నివారణ మార్గాలు"


ఒక సెకను పాటు లవంగ నూనె (క్లోవ్‌ ఆయిల్‌)ను పీల్చాలి.

 రోజుకు ఒక లవంగ మొగ్గనైనా నమలాలి.

 ఒకటి నుంచి ఐదు గ్రాముల పచ్చి వెల్లుల్లి రేకలు, లేదా ఉల్లిగడ్డ, అల్లం ముక్కను తినాలి. 
రెండు గ్రాముల పసుపును వేడి పాలలో కలుపుకొని సేవించాలి. 
నిమ్మలాంటి సి విటమిన్‌ ఎక్కువగా ఉండే పళ్ళను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్‌ సి ఉన్న పదార్థాలు నిమ్మకాయ,ఉసిరికాయ,జామకాయలు మొదలైనవి

నీలగిరి (యుకలిప్టస్‌) ఆయిల్‌ చుక్కలను చేతిరుమాళ్ళపైన, మాస్క్‌లపైన వేసుకొని వాసన చూస్తూ ఉంటే స్వైన్‌ ఫ్లూ సోకే ప్రమాదం తక్కువ అవుతుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ ఐవి) సూచించింది.
తులసి ఆకులలోనున్న ఔషధ గుణాలు స్వైన్‌ ఫ్లూ వ్యాధిని అరికట్టేందుకు ఎంతగానో ఉపయోగపడతా యంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

 స్వైన్‌ఫ్లూ బారిన పడినవారు ప్రతిరోజు ఉదయం పరకడుపున తులసి ఆకులు (20-25 ఆకులు) పేస్ట్‌ను తీసుకోవాలి. 
అలాగే సాయంత్రం ఖాళీ కడుపున తీసుకుంటుంటే చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఇలా తీసుకోవటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి స్వైన్‌ఫ్లూ వ్యాధిని సమూలంగా నాశనం చేస్తుందంటున్నారు .
తులసి ఆకులోనున్న ఔషధ గుణాలను ప్రస్తుతం జపాన్‌ దేశస్తులు వాడుతున్నారని, స్వైన్‌ఫ్లూ బారినపడకుండా వుండేందుకు వారు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయుర్వేద వైద్యులు అన్నారు.
ప్రాణాంతక స్వైన్‌ ఫ్లూ మనల్ని సోకకుండా తులసి కాపాడడమే కాకుండా వ్యాధి సోకిన వారిని త్వరగా కోలుకొనేలా చేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడించారు. తులసిలో ఉండే ‘యాంటీ ఫ్లూ’ పదార్థం వల్ల ఇది సాధ్యమని నిర్ధారణ అయిందంటున్నారు.
మనలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తులసి, విటమిన్‌ సి ఉన్న పదార్థాలు నిమ్మకాయ, రాతి ఉసిరికాయ (ఇండియన్‌ గూస్‌ బెరి) పొడిని వేడినీటిలో కలుపుకొని సేవిస్తే మరింత సమర్థంగా పనిచేస్తుంది.

యాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు


                   యాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు



యాపిల్ పండు రంగు చూసినా.. రుచి చూసినా.. ఎవరూ వదలరు.

రోజూ తిన్నాగాని దానిపై నాలుకకు  మోజుతగ్గదు. యాపిల్ లో 7500 రకాలు వున్నాయంట.

ఏ వయసు వారైనా ఈ పండును తినటానికి చాలా ఇష్టపడతారు.  

ఈ ఆపిల్ పండు ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో తెలుసుకుందామా!


1. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి.


    సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.

2. యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది.


    పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. 

    పండే ప్రక్రియ మొదలైనప్పుడు ఇది మొత్తం చక్కెర పదార్థాంగా రూపాంతరం చెందుతుంది.

3. యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం
 గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి 

    దోహదపడుతుంది. 

   ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర 

    పోషిస్తుంది.

4. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా. 


    యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి కీలక అవయవాల 

     పనితీరును మెరుగుపరుస్తుంది.

5. ఉదరంలో గ్యాస్ తయారయ్యే తత్వం కలిగినవారు యాపిల్స్ వాడకూడదు. 

    
    జీర్ణాశయంలో నివసించే బ్యాక్టీరియా యాపిల్‌లోని తీపి పదార్థాలను పులిసేలా చేయటం దీనికి కారణం.

6. గుండె స్పందనలను క్రమబద్ధీకరించటంకోసం డిగాక్సిన్ వాడే వారు యాపిల్స్‌ని తీసుకోకపోవటం మంచిది. 


    యాపిల్స్‌లోని పెక్టిన్ పదార్థాలను డిగాక్సిన్‌ని బంధించి శరీరానికి అందనివ్వకుండా చేస్తాయి.

7. యాపిల్ గింజల్లో ఎమిగ్డాలిన్ అనే సయనైడ్‌ని పోలిన విష పదార్థం ఉంటుంది. 
ఈ  విష పదార్థం వలన
     
    పిల్లలు గాని యాపిల్ గింజలను అధిక మొత్తాల్లో తింటే ప్రాణప్రమాదం జరుగుతుంది.

8. యాపిల్‌ని ఉడికించి గాని లేదా బేక్ చేసి గాని తినకూడదు.  

   
   యాపిల్‌లో సహజంగా ఉండే విటమిన్-సి వేడి చేయటం ద్వారా పోతుంది

   యాంటీ ప్లాట్యులెంట్ డైట్, లోఫైబర్ డైట్ తీసుకునేవారు యాపిల్స్‌ని వాడకూడదు.

9. ఆపిల్ రెడ్ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా 


    అడ్డుకుంటాయని నిపుణులంటున్నారు. 
  
   ‘ట్రిటర్‌పెనాయిడ్స్‌’గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల 

    పెరుగుదలను అడ్డుకుంటాయట. 

    అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్‌ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర.

10.ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే 


     ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్‌ 

     (వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది.

     100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల “విటమిన్ సి” ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్‌   

     ప్రభావంతో సమానం.

11.ఆపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్
 శరీరంలో రక్తాన్ని మరింత పటిష్టం చేస్తాయి.
  
    ఆపిల్‌లో మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి లివర్ (కాలేయం), 

    జీర్ణక్రియలలో తలెత్తే సమస్యలను నివారిస్తాయి.

12.పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కిడ్నీ (మూత్ర పిండాలు)లలో రాళ్లు ఏర్పడటాన్ని 


     నివారిస్తుంది.


    ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.

13.ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి 


     పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.