స్వైన్‌ ఫ్లూ నివారణ మార్గాలు

"స్వైన్‌ ఫ్లూ నివారణ మార్గాలు"


ఒక సెకను పాటు లవంగ నూనె (క్లోవ్‌ ఆయిల్‌)ను పీల్చాలి.

 రోజుకు ఒక లవంగ మొగ్గనైనా నమలాలి.

 ఒకటి నుంచి ఐదు గ్రాముల పచ్చి వెల్లుల్లి రేకలు, లేదా ఉల్లిగడ్డ, అల్లం ముక్కను తినాలి. 
రెండు గ్రాముల పసుపును వేడి పాలలో కలుపుకొని సేవించాలి. 
నిమ్మలాంటి సి విటమిన్‌ ఎక్కువగా ఉండే పళ్ళను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్‌ సి ఉన్న పదార్థాలు నిమ్మకాయ,ఉసిరికాయ,జామకాయలు మొదలైనవి

నీలగిరి (యుకలిప్టస్‌) ఆయిల్‌ చుక్కలను చేతిరుమాళ్ళపైన, మాస్క్‌లపైన వేసుకొని వాసన చూస్తూ ఉంటే స్వైన్‌ ఫ్లూ సోకే ప్రమాదం తక్కువ అవుతుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ ఐవి) సూచించింది.
తులసి ఆకులలోనున్న ఔషధ గుణాలు స్వైన్‌ ఫ్లూ వ్యాధిని అరికట్టేందుకు ఎంతగానో ఉపయోగపడతా యంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

 స్వైన్‌ఫ్లూ బారిన పడినవారు ప్రతిరోజు ఉదయం పరకడుపున తులసి ఆకులు (20-25 ఆకులు) పేస్ట్‌ను తీసుకోవాలి. 
అలాగే సాయంత్రం ఖాళీ కడుపున తీసుకుంటుంటే చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఇలా తీసుకోవటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి స్వైన్‌ఫ్లూ వ్యాధిని సమూలంగా నాశనం చేస్తుందంటున్నారు .
తులసి ఆకులోనున్న ఔషధ గుణాలను ప్రస్తుతం జపాన్‌ దేశస్తులు వాడుతున్నారని, స్వైన్‌ఫ్లూ బారినపడకుండా వుండేందుకు వారు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయుర్వేద వైద్యులు అన్నారు.
ప్రాణాంతక స్వైన్‌ ఫ్లూ మనల్ని సోకకుండా తులసి కాపాడడమే కాకుండా వ్యాధి సోకిన వారిని త్వరగా కోలుకొనేలా చేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడించారు. తులసిలో ఉండే ‘యాంటీ ఫ్లూ’ పదార్థం వల్ల ఇది సాధ్యమని నిర్ధారణ అయిందంటున్నారు.
మనలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తులసి, విటమిన్‌ సి ఉన్న పదార్థాలు నిమ్మకాయ, రాతి ఉసిరికాయ (ఇండియన్‌ గూస్‌ బెరి) పొడిని వేడినీటిలో కలుపుకొని సేవిస్తే మరింత సమర్థంగా పనిచేస్తుంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి