Pages
ఇది మన ప్రపంచం....
స్వైన్ ఫ్లూ నివారణ మార్గాలు
"స్వైన్ ఫ్లూ నివారణ మార్గాలు"
ఒక సెకను పాటు లవంగ నూనె (క్లోవ్ ఆయిల్)ను పీల్చాలి.
రోజుకు ఒక లవంగ మొగ్గనైనా నమలాలి.
ఒకటి నుంచి ఐదు గ్రాముల పచ్చి వెల్లుల్లి రేకలు, లేదా ఉల్లిగడ్డ, అల్లం ముక్కను తినాలి.
రెండు గ్రాముల పసుపును వేడి పాలలో కలుపుకొని సేవించాలి.
నిమ్మలాంటి సి విటమిన్ ఎక్కువగా ఉండే పళ్ళను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న పదార్థాలు నిమ్మకాయ,ఉసిరికాయ,జామకాయలు మొదలైనవి
నీలగిరి (యుకలిప్టస్) ఆయిల్ చుక్కలను చేతిరుమాళ్ళపైన, మాస్క్‌లపైన వేసుకొని వాసన చూస్తూ ఉంటే స్వైన్ ఫ్లూ సోకే ప్రమాదం తక్కువ అవుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ ఐవి) సూచించింది.
తులసి ఆకులలోనున్న ఔషధ గుణాలు స్వైన్ ఫ్లూ వ్యాధిని అరికట్టేందుకు ఎంతగానో ఉపయోగపడతా యంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
స్వైన్‌ఫ్లూ బారిన పడినవారు ప్రతిరోజు ఉదయం పరకడుపున తులసి ఆకులు (20-25 ఆకులు) పేస్ట్‌ను తీసుకోవాలి.
అలాగే సాయంత్రం ఖాళీ కడుపున తీసుకుంటుంటే చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఇలా తీసుకోవటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి స్వైన్‌ఫ్లూ వ్యాధిని సమూలంగా నాశనం చేస్తుందంటున్నారు .
తులసి ఆకులోనున్న ఔషధ గుణాలను ప్రస్తుతం జపాన్ దేశస్తులు వాడుతున్నారని, స్వైన్‌ఫ్లూ బారినపడకుండా వుండేందుకు వారు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయుర్వేద వైద్యులు అన్నారు.
ప్రాణాంతక స్వైన్ ఫ్లూ మనల్ని సోకకుండా తులసి కాపాడడమే కాకుండా వ్యాధి సోకిన వారిని త్వరగా కోలుకొనేలా చేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడించారు. తులసిలో ఉండే ‘యాంటీ ఫ్లూ’ పదార్థం వల్ల ఇది సాధ్యమని నిర్ధారణ అయిందంటున్నారు.
మనలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తులసి, విటమిన్ సి ఉన్న పదార్థాలు నిమ్మకాయ, రాతి ఉసిరికాయ (ఇండియన్ గూస్ బెరి) పొడిని వేడినీటిలో కలుపుకొని సేవిస్తే మరింత సమర్థంగా పనిచేస్తుంది.
యాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు
యాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు
యాపిల్ పండు రంగు చూసినా.. రుచి చూసినా.. ఎవరూ వదలరు.
రోజూ తిన్నాగాని దానిపై నాలుకకు మోజుతగ్గదు. యాపిల్ లో 7500 రకాలు వున్నాయంట.
ఏ వయసు వారైనా ఈ పండును తినటానికి చాలా ఇష్టపడతారు.
ఈ ఆపిల్ పండు ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో తెలుసుకుందామా!
1. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి.
సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.
2. యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది.
పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది.
పండే ప్రక్రియ మొదలైనప్పుడు ఇది మొత్తం చక్కెర పదార్థాంగా రూపాంతరం చెందుతుంది.
3. యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి
దోహదపడుతుంది.
ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర
పోషిస్తుంది.
4. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా.
యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి కీలక అవయవాల
పనితీరును మెరుగుపరుస్తుంది.
5. ఉదరంలో గ్యాస్ తయారయ్యే తత్వం కలిగినవారు యాపిల్స్ వాడకూడదు.
జీర్ణాశయంలో నివసించే బ్యాక్టీరియా యాపిల్‌లోని తీపి పదార్థాలను పులిసేలా చేయటం దీనికి కారణం.
6. గుండె స్పందనలను క్రమబద్ధీకరించటంకోసం డిగాక్సిన్ వాడే వారు యాపిల్స్‌ని తీసుకోకపోవటం మంచిది.
యాపిల్స్‌లోని పెక్టిన్ పదార్థాలను డిగాక్సిన్‌ని బంధించి శరీరానికి అందనివ్వకుండా చేస్తాయి.
7. యాపిల్ గింజల్లో ఎమిగ్డాలిన్ అనే సయనైడ్‌ని పోలిన విష పదార్థం ఉంటుంది. ఈ విష పదార్థం వలన
పిల్లలు గాని యాపిల్ గింజలను అధిక మొత్తాల్లో తింటే ప్రాణప్రమాదం జరుగుతుంది.
8. యాపిల్ని ఉడికించి గాని లేదా బేక్ చేసి గాని తినకూడదు.
యాపిల్‌లో సహజంగా ఉండే విటమిన్-సి వేడి చేయటం ద్వారా పోతుంది.
యాంటీ ప్లాట్యులెంట్ డైట్, లోఫైబర్ డైట్ తీసుకునేవారు యాపిల్స్‌ని వాడకూడదు.
9. ఆపిల్ రెడ్ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్ కణాలను సమర్థంగా
అడ్డుకుంటాయని నిపుణులంటున్నారు.
‘ట్రిటర్‌పెనాయిడ్స్’గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల
పెరుగుదలను అడ్డుకుంటాయట.
అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర.
10.ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే
ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్
(వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది.
100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల “విటమిన్ సి” ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్
ప్రభావంతో సమానం.
11.ఆపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్ శరీరంలో రక్తాన్ని మరింత పటిష్టం చేస్తాయి.
ఆపిల్‌లో మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి లివర్ (కాలేయం),
జీర్ణక్రియలలో తలెత్తే సమస్యలను నివారిస్తాయి.
12.పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కిడ్నీ (మూత్ర పిండాలు)లలో రాళ్లు ఏర్పడటాన్ని
నివారిస్తుంది.
ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.
13.ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి
పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
జామపండు - ఆరోగ్య రహస్యాలు (Guava)
జామపండు - ఆరోగ్య రహస్యాలు
1) అతితక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.
2) ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
3) వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.
4) A , B , C , విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా
లభిస్తాయి.
5) కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.
6) స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
7) జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
8) దీనిలో విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి , కంటికి చాల మంచిది
9) అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
10) జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు , బీపి పెరగకుండా చేస్తాయి.
11) అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B 6 , B 9 ) , E , K విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త
కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.
జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.
* ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.
* గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
* జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
Blog Subscription
Search this blog
Blogger templates
Popular Posts
-
తిరుమల ఏడుకొండలు గురించిన పరమార్ధం మీకు తెలుసా? తిరుమల 7 కొండలు.. 1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేష...
-
ప్రపంచంలోనే అతి పెద్ద హిందు దేవాలయం కాంబోడియా దేశంలోని అంగ్ కోర్ వాట్................................. . భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్ర...
-
Ingredients for making Hyderabadi Chicken Dum Biryani 1 ½ cups Basmathi rice 450 gms Chicken, With bones 1 Large Onion, Fried ...
-
ఇంటిని అందంగా అలంకరించడం కోసం మట్టి మరియు కొయ్య బొమ్మలు
-
"స్వైన్ ఫ్లూ నివారణ మార్గాలు" ఒక సెకను పాటు లవంగ నూనె (క్లోవ్ ఆయిల్)ను పీల్చాలి. రోజుకు ఒక లవంగ మొగ్గనైనా నమలాలి....
-
పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు : 1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి"Opposite direction ( వ్యతిరేక ద...
-
జామపండు - ఆరోగ్య రహస్యాలు జామపండు తినటానికి అందరు ఇష్ట పడ తారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే...
-
మీకూ మీ కుటుంభ సభ్యులకూ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
Labels
- చిత్ర సమీక్ష (1)
- రామయ్య వస్తావయ్యా (1)
- angkor wat (1)
- Animal planet (1)
- Cute Flowers (1)
- Devotional Truths (6)
- Earth place (1)
- Film figures (3)
- Health Tips (5)
- hindu temples (2)
- Indian art (9)
- just for fun (1)
- Money Collections (1)
- Paper art (1)
- tasty recipes (5)
- wishes (4)
Blogger ఆధారితం.
Translate
Labels
- చిత్ర సమీక్ష (1)
- రామయ్య వస్తావయ్యా (1)
- angkor wat (1)
- Animal planet (1)
- Cute Flowers (1)
- Devotional Truths (6)
- Earth place (1)
- Film figures (3)
- Health Tips (5)
- hindu temples (2)
- Indian art (9)
- just for fun (1)
- Money Collections (1)
- Paper art (1)
- tasty recipes (5)
- wishes (4)












