Pages
ఇది మన ప్రపంచం....
పురాతన కాలపు నాణ్యాలు
రెండు తలల జంతువులు
వివిధ రకాల డిజైన్లలొ కొవ్వొత్తులు
వెజిటబుల్ పులావ్
వెజిటబుల్ పులావ్
కావలసిన పదార్ధాలు :
బియ్యం : 3గ్లాసులు
క్యారెట్ : నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
బీన్సు: వంద గ్రాములు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
బంగాళా దుంపలు లేదా ఆలూ: నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
ఉల్లిపాయలు : అయిదు ఆరు ( పొడుగ్గా చీలికలు చేసుకోవాలి)
కాలిఫ్లవర్: ఒక చిన్న పువ్వు ( కావాలంటే వేసుకోవచ్చు )
పచ్చి బఠాణీ : ఒక కప్ ( నాన బెట్టినవి, లేదా తాజావి )
లవంగాలు: అయిదు ఆరు
యాలకులు : అయిదు ఆరు
దాల్చిన చెక్క : అయిదు ఆరు చిన్న ముక్కలు
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు టీ స్పూన్లు
నూనె , నేయ్యి లేదా డాల్డా : తగినంత
పచ్చిమిర్చి: అయిదు ఆరు( చీలికలు చేసుకోవాలి)
ధనియాలు, జీలకర్ర పొడి: రెండు స్పూన్లు ( కావలిస్తే వేసుకోవచ్చు )
కారం: ఒక స్పూను ( కారం ఇష్ట పడేవాళ్ళు వేసుకోవచ్చు )
పసుపు: చిటికెడు ( రంగు కోసం )
ఉప్పు : రుచికి తగినంత
నీరు: ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు
కొత్తిమీర: ఒక కట్ట
పుదినా : అర కట్ట ( తినేవారు వేసుకోవచ్చు)
జీడిపప్పు: పది పదిహేను ( కావాలంటే వేసుకోవచ్చు)
బిర్యాని ఆకు : రెండు మూడు
తయారు చేసే విధానం :
ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.
ఒక మందంగా ఉన్న గిన్నె లేదా కుక్కర్ గాని తీసుకొని గ్యాసు మీద పెట్టాలి. అందులో సుమారు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు , జీడి పప్పు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.
ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్యాలి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి. వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి.
అవి కొంచెం వేగ నివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వెయ్యాలి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు, అంటే 3గ్లాసులు బియ్యానికి 6గ్లాసులు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Blog Subscription
Search this blog
Blogger templates
Popular Posts
-
ప్రపంచంలోనే అతి పెద్ద హిందు దేవాలయం కాంబోడియా దేశంలోని అంగ్ కోర్ వాట్................................. . భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్ర...
-
యాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు యాపిల్ పండు రంగు చూసినా.. రుచి చూసినా.. ఎవరూ వదలరు. రోజూ తిన్నాగాని దానిపై ...
-
మీకూ మీ కుటుంభ సభ్యులకూ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
-
తిరుమల ఏడుకొండలు గురించిన పరమార్ధం మీకు తెలుసా? తిరుమల 7 కొండలు.. 1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేష...
-
పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు : 1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి"Opposite direction ( వ్యతిరేక ద...
-
"స్వైన్ ఫ్లూ నివారణ మార్గాలు" ఒక సెకను పాటు లవంగ నూనె (క్లోవ్ ఆయిల్)ను పీల్చాలి. రోజుకు ఒక లవంగ మొగ్గనైనా నమలాలి....
-
ఇంటిని అందంగా అలంకరించడం కోసం మట్టి మరియు కొయ్య బొమ్మలు
-
జామపండు - ఆరోగ్య రహస్యాలు జామపండు తినటానికి అందరు ఇష్ట పడ తారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే...
Labels
- చిత్ర సమీక్ష (1)
- రామయ్య వస్తావయ్యా (1)
- angkor wat (1)
- Animal planet (1)
- Cute Flowers (1)
- Devotional Truths (6)
- Earth place (1)
- Film figures (3)
- Health Tips (5)
- hindu temples (2)
- Indian art (9)
- just for fun (1)
- Money Collections (1)
- Paper art (1)
- tasty recipes (5)
- wishes (4)
Blogger ఆధారితం.
Translate
Labels
- చిత్ర సమీక్ష (1)
- రామయ్య వస్తావయ్యా (1)
- angkor wat (1)
- Animal planet (1)
- Cute Flowers (1)
- Devotional Truths (6)
- Earth place (1)
- Film figures (3)
- Health Tips (5)
- hindu temples (2)
- Indian art (9)
- just for fun (1)
- Money Collections (1)
- Paper art (1)
- tasty recipes (5)
- wishes (4)













































