మధుమేహగ్రస్తులకు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ బ్రౌన్ రైస్ ఇడ్లీ


మధుమేహగ్రస్తులకు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ బ్రౌన్ రైస్ ఇడ్లీ:


                   సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిలో చాలా వెరైటీలున్నాయి. వాటిలో ముఖ్యంగా రెగ్యులర్ గా తయారు చేసుకొనే బ్రేక్ ఫాస్ట్ రిసిపిలు, ఇడ్లీ, దోసె, ఉప్మా, పొంగల్, రైస్ ఐటమ్స్ లో కొన్ని. వీటిల్లో ఇడ్లీ చాలా పాపులర్ వంటకం. చాలా త్వరగా తయారయ్యే వంటకం. ఇడ్లీ సాంబార్, చట్నీ రుచి మాత్రమే కాదు. హెల్తీ మరియు కడుపు ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. రెగ్యులర్ గా తయారు చేసుకొని ఇడ్లీ తినితిని బోరుకొడుతుంటే కొంచెం వెరైటీగా ట్రై చేయండి. బ్రౌన్ రైస్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందుకే వీటిని మన రెగ్యులర్ డైట్ లో ఏదో ఒక విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. 
                   ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు ఈ బ్రౌన్ రైస్ తో చేసే వంటలు చాలా సహాయపడుతాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. దాంతో పాటు ఇన్సులిన్ స్థాయిలు కూడా స్థిరంగా ఉండేలా చేస్తాయి. బ్రౌన్ రైస్ లో అధిక శాతంలో ఫైబర్ ఉన్నందున క్యాన్సర్ నివారిస్తుంది, బరువు తగ్గిస్తుంది మరియు షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని మధుమేహగ్రస్తులు డైలీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు.

మధుమేహగ్రస్తులకు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ బ్రౌన్ రైస్ ఇడ్లీ కావల్సిన పదార్థాలు:
బ్రౌన్ రైస్: 3cups
ఉద్దిపప్పు (మినపప్పు): 1/2cup
పోహా(అటుకులు): 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 7-8cups

తయారుచేయు విధానం: 
1. ముందుగా బ్రౌన్ రైస్, పోహ, ఉద్దిపప్పు(మినపప్పు) మూడింటిని వేరు వేరుగా శుభ్రంగా కడిగి, తర్వాత నీళ్ళు పోసి 8గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. 8గంటల తర్వాత రైస్,పోహా, ఉద్దిపప్పు(మినపప్పు) నుండి నీళ్ళను వంపేసి, మూడింటిని వేరువేరుగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
3. ఇలా చేసుకొన్న తర్వాత అన్ని పదార్థాలను ఒక పెద్ద బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని నాలుగు గంటలపాటు పక్కన పెట్టుకోవాలి. పిండి పులుయడానికి కొద్ది సమయం పడుతుంది.
4. తర్వాత అందులో ఉప్పు మిక్స్ చేసి, ఇడ్లీ ప్లేట్స్ లో పోయాలి తర్వాత, ఇడ్లీ ప్లేట్స్ ను ఇడ్లీ పాత్రలో పెట్టి 5-10నిముషలు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
 
5. అంతే ఐదు నిముషాల తర్వాత ఇడ్లీ స్టాండ్ ను బయటకు తీసి, వేడి వేడి ఇడ్లీలను కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి.




0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి